పిడుగుపాటుతో చనిపోతే మహారాష్ట్రలో రూ. 4 లక్షల పరిహారం

పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చనిపోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ణ పరిహారాన్ని అందించాలని నిర్ణయించింది. గత 15 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు 41 మంది మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.