Telugu Global
Others

మూడేళ్ల లా కోర్సు రద్దుకు మద్రాసు హైకోర్టు సిఫార్సు

మూడేళ్ల లా కోర్సును రద్దు చేయాలని… ఇంజినీరింగ్, వైద్య శాస్త్రాల మాదిరిగా ఐదేళ్ల లా కోర్సును కొనసాగించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిపుణులైన వారితో నడిపించాలని పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తీసుకురావాల్సిన సమూల మార్పులను గురించి సూచించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహణ బాధ్యతలను సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో […]

మూడేళ్ల లా కోర్సును రద్దు చేయాలని… ఇంజినీరింగ్, వైద్య శాస్త్రాల మాదిరిగా ఐదేళ్ల లా కోర్సును కొనసాగించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిపుణులైన వారితో నడిపించాలని పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తీసుకురావాల్సిన సమూల మార్పులను గురించి సూచించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహణ బాధ్యతలను సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో కమిటీ శాశ్వతంగాగానీ, లేదా అడ్వకేట్‌ చట్టంలో సరియైన సవరణలు చేసేవరకు గాని కొనసాగించాలని పేర్కొంది.

First Published:  5 Oct 2015 1:10 PM GMT
Next Story