Telugu Global
Cinema & Entertainment

శ్రీమంతుడి సైకిల్- గెలుచుకోవడం ఈజీ!

శ్రీమంతుడు సినిమాలో మహేష్ తొక్కిన సైకిల్ లక్కీడ్రాలో సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. శాశ్వతంగా సొంతం చేసుకునే శ్రీమంతుడి కోసం ఎదురుచూస్తోంది. ఈ సైకిల్ సొంతం చేసుకోవడం కూడా ఈజీ. కాకుంటే కాసింత అదృష్టం ఉండాలి. యూఎస్ బ్రాండ్‌కు చెందిన ఈ సైకిల్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నారు. www.iamsrimanthudu.comలో రూ.999 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లోనే డ్రా ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. విజేతకు ఈ సైకిల్‌ బ్రహ్మోత్సవం మూవీ సెట్‌లో స్వయంగా మహేష్ బాబు […]

శ్రీమంతుడి సైకిల్-  గెలుచుకోవడం ఈజీ!
X

శ్రీమంతుడు సినిమాలో మహేష్ తొక్కిన సైకిల్ లక్కీడ్రాలో సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. శాశ్వతంగా సొంతం చేసుకునే శ్రీమంతుడి కోసం ఎదురుచూస్తోంది. ఈ సైకిల్ సొంతం చేసుకోవడం కూడా ఈజీ. కాకుంటే కాసింత అదృష్టం ఉండాలి. యూఎస్ బ్రాండ్‌కు చెందిన ఈ సైకిల్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నారు. www.iamsrimanthudu.comలో రూ.999 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అనంతరం ఆన్‌లైన్‌లోనే డ్రా ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. విజేతకు ఈ సైకిల్‌ బ్రహ్మోత్సవం మూవీ సెట్‌లో స్వయంగా మహేష్ బాబు అందజేస్తారు. డ్రాలో పాల్గొన్న మిగిలిన వారందరికి మహేష్ బాబు సంతకం చేసిన టీ షర్టును అందించనున్నారు. అన్నట్టు 20 గేర్లు ఉండే ఈ సైకిల్ అసలు ధర మూడున్నర లక్షల రూపాయలు. ఇలా వచ్చిన సొమ్మును పూర్తిగా సేవ కార్యక్రమానికి ఖర్చు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. సో… శ్రీమంతుడు సైకిల్ సొంతం చేసుకుని ఆ అసలు శ్రీమంతుడు ఎవరో ?.

First Published:  6 Oct 2015 7:57 AM GMT
Next Story