మావోల చెరలో ముగ్గురు టీడీపీ నేతలు

విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు తెలుగుదేశం నాయకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. జీకే వీధి మండలంలో టీడీపీ మండలాధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గం సభ్యుడు ముక్తల మహేష్‌, జన్మభూమి కమిటీ మండలాధ్యక్షుడు వందనం బాలయ్యను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి తీసుకుపోయారు. జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరు మాట్లాడుకుంటున్నప్పుడు మావోలు ఎత్తుకుపోయారు. బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కర పత్రాలు పంచారు. ఈ నెల 7 నుంచి 13 వరకు ఏఓబీ బంద్‌ పాటించాలని పిలుపు ఇచ్చారు.