Telugu Global
NEWS

రైతుల్లో భరోసాకు టీడీపీ-బీజేపీ బస్సుయాత్ర ప్రారంభం

రైతుల్లో భరోసా కల్పించడానికి, వారిలో భవిష్యత్‌ పట్ల నమ్మకం కలిగించడానికి ఉద్దేశించి తలపెట్టిన బస్‌ యాత్రను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి ప్రారంభమైంది. ఇందులో భారతీయ జనతాపార్టీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఈ బస్‌ యాత్రను నిర్వహిస్తున్నారు. ఉభయ పార్టీలకు చెందిన ఇతర నాయకులు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ నిజం స్వరూపం క్రమంగా బయటపడుతోందని విమర్శించారు. రైతు సమస్యలపై రెండు […]

రైతుల్లో భరోసాకు టీడీపీ-బీజేపీ బస్సుయాత్ర ప్రారంభం
X

రైతుల్లో భరోసా కల్పించడానికి, వారిలో భవిష్యత్‌ పట్ల నమ్మకం కలిగించడానికి ఉద్దేశించి తలపెట్టిన బస్‌ యాత్రను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి ప్రారంభమైంది. ఇందులో భారతీయ జనతాపార్టీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఈ బస్‌ యాత్రను నిర్వహిస్తున్నారు. ఉభయ పార్టీలకు చెందిన ఇతర నాయకులు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ నిజం స్వరూపం క్రమంగా బయటపడుతోందని విమర్శించారు. రైతు సమస్యలపై రెండు రోజులు అసెంబ్లీలో చర్చ జరిగినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించేందుకే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని ఆయన తెలిపారు. రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు పోరాడతామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

రైతులకు ప్రముఖుల అండ అవసరం: రేవంత్
రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్న నేపథ్యంలో ప్రముఖులంతా వారిలో భరోసా కల్పించేందుకు ముందుకు రావాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. సెలబ్రిటీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు సినీనటులు ఏ కార్యక్రమం చేపట్టినా తమ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

First Published:  6 Oct 2015 1:00 AM GMT
Next Story