Telugu Global
NEWS

నేడు గ్రేటర్‌లో టీవీ ప్రసారాలు బంద్‌కు నిర్ణయం

డిజిటలైజేషన్‌కు వ్యతిరేకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 24 గంటలపాటు కేబుల్‌ టీవీ ఆపరేటర్లు బంద్‌ పాటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం. జితేందర్ ప్రకటించారు. డిజిటలైజేషన్ అయితే కేబుల్ టీవీ ప్రేక్షకులు అన్ని పన్నులతో సహా 500 నుంచి 600 రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. డిజిటలైజేషన్ విధానానికి తాము వ్యతిరేకం కాకపోయినా, ఎమ్.ఎస్.ఓ.లు రేట్లు పెంచాలని అంటున్నారని, దీనివల్ల తాము ప్రజలపై భారం మోపవలసి వస్తుందని […]

డిజిటలైజేషన్‌కు వ్యతిరేకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 24 గంటలపాటు కేబుల్‌ టీవీ ఆపరేటర్లు బంద్‌ పాటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం. జితేందర్ ప్రకటించారు. డిజిటలైజేషన్ అయితే కేబుల్ టీవీ ప్రేక్షకులు అన్ని పన్నులతో సహా 500 నుంచి 600 రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. డిజిటలైజేషన్ విధానానికి తాము వ్యతిరేకం కాకపోయినా, ఎమ్.ఎస్.ఓ.లు రేట్లు పెంచాలని అంటున్నారని, దీనివల్ల తాము ప్రజలపై భారం మోపవలసి వస్తుందని వారు అన్నారు. కేబుల్ టీవి బంద్‌కు గ్రేటర్ హైదరాబాద్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఉదయం ఆరు గంటల నుంచి ఇరవైనాలుగు గంటలపాటు ఈ బంద్ పాటిస్తామని ఆయన తెలిపారు.

First Published:  5 Oct 2015 1:39 PM GMT
Next Story