బీహార్‌లో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

బీహార్‌ రాష్ట్రంలోని కర్యిల్‌ గ్రామంలోని రెండో జాతీయ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.