Telugu Global
Others

అక్బర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మరో వివాదంలో చిక్కుకున్నారు.  బీహార్‌ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు విషయంలో ఓవైసీని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసులు సిద్ధమయ్యారు. అక్బర్‌ను అరెస్ట్ చేయాలని కిషన్ గంజ్ ఎస్పీ రాజీవ్ రంజన్ పోలీసులకు ఆదేశించారు. ఇటీవల కిషన్‌ గంజ్ జిల్లాలో పర్యటించిన అక్బర్  ఓ బహిరంగ సభలో మోదీతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీపై చార్జిషీట్ దాఖలు చేసి ఉంటే ఈ […]

అక్బర్ అరెస్ట్‌కు  రంగం సిద్ధం
X

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు విషయంలో ఓవైసీని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసులు సిద్ధమయ్యారు. అక్బర్‌ను అరెస్ట్ చేయాలని కిషన్ గంజ్ ఎస్పీ రాజీవ్ రంజన్ పోలీసులకు ఆదేశించారు. ఇటీవల కిషన్‌ గంజ్ జిల్లాలో పర్యటించిన అక్బర్ ఓ బహిరంగ సభలో మోదీతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీపై చార్జిషీట్ దాఖలు చేసి ఉంటే ఈ రోజు అతడు ఈ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదన్నారు. మోదీని సైతాన్ అంటూ సంబోధించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెసే బాధ్యత వహించాలన్నారు. అయోధ్యలోని రామాలయం తాళాలు తెరించేందుకు అనుమతించడం వల్లే బాబ్రీ మసీదు కూల్చివేత సాధ్యమైందన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా మరికొన్ని వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో అక్బర్ చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని బీహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది.

First Published:  7 Oct 2015 1:29 AM GMT
Next Story