త్వరలో కాలేజీ విద్యార్థులకూ సన్నబియ్యం: కేసీఆర్‌

ఎవరూ అడగకపోయినా పెద్ద మనసుతో హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సీఎం ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో కాలేజీ విద్యార్థులకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎవరూ ఊహించని అభివృద్ధిని చేసి చూపించామని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.