రాహుల్‌ సభకోసం బక్కరైతు పంట ధ్వంసం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సభ కోసం కర్ణాటకలో చేతికొచ్చిన పంటపొలాన్ని ధ్వంసం చేశారు. నాలుగెకరాల్లో ఓ నిరుపేద రైతు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజోన్న పంటను రాహుల్ సభ కోసం నరికివేసి సభా ప్రాంగణం సిద్ధం చేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే… కరువు కారణంగా పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి రాహుల్ ఈ సభను తలపెట్టారు. మధ్య కర్ణాటకలోని రాణిబిన్నూర్ సమీపంలో శనివారం నిర్వహించనున్న ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారు. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఈ చర్యకు ఒడిగట్టడంతో రైతు బోరుమంటున్నాడు.