Telugu Global
Others

శంకుస్థాపనకు అన్ని విమానాలు వస్తాయా?

కట్టబోయే ఏపీ రాజధాని ఎలా ఉంటుందో గానీ శంకుస్థాపన కార్యక్రమం మాత్రం ఊహించని రేంజ్‌లో జరిగేలా ఉంది. మనీ మంచినీళ్లలా ఖర్చైనా సరే ఈవెంట్ మాత్రం అదిరిపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన ఓ పండుగలా జరగాలని … అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కో విషయం బయటకొస్తున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి దాదాపు వంద ప్రత్యేక విమానాల్లో అతిథులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక […]

శంకుస్థాపనకు అన్ని విమానాలు వస్తాయా?
X

కట్టబోయే ఏపీ రాజధాని ఎలా ఉంటుందో గానీ శంకుస్థాపన కార్యక్రమం మాత్రం ఊహించని రేంజ్‌లో జరిగేలా ఉంది. మనీ మంచినీళ్లలా ఖర్చైనా సరే ఈవెంట్ మాత్రం అదిరిపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన ఓ పండుగలా జరగాలని … అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కో విషయం బయటకొస్తున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి దాదాపు వంద ప్రత్యేక విమానాల్లో అతిథులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక విమానాల్లో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నవే. ప్రధాని, ముఖ్యమంత్రులు వంటి వారు మాత్రం వారి ప్రభుత్వం తరపు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు. వీవీఐపీలు ఎవరైనా సరే ఈవెంట్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపితే వారి కోసం ప్రత్యేక విమానం రెడీ చేసే గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరికొద్ది రోజులు గడిస్తే ఇలాంటి అంశాలపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

అతిథులను దింపేసిన తర్వాత విమానాలకు శంషాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో 15 హెలిపాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు సభా వేదికలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద కార్యక్రమం దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయేలా ఉండాలని బాబు భావిస్తున్నారు.

First Published:  7 Oct 2015 11:41 AM GMT
Next Story