Telugu Global
Others

బాహుబలి సినిమా గుర్తు చేసిన రోజా

ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిరాహార దీక్ష వేదిక వద్ద ప్రసంగించిన ఎమ్మెల్యే రోజా పంచ్ డైలాగ్‌లతో ఫైర్ పుట్టించారు. మరోసారి బాహుబలి సినిమాను గుర్తు చేశారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రం పాలిట కాలకేయుడిలా తయారయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబుపాలన చూస్తుంటే బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాలన గుర్తుకొస్తోందన్నారు. కాలకేయుడిలా ప్రజల మీద చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారన్నారు. ఈ బల్లాలదేవ పాలనను అంతం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని రోజా అన్నారు. జగన్ ఓ బాహుబలి […]

బాహుబలి సినిమా గుర్తు చేసిన రోజా
X

ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిరాహార దీక్ష వేదిక వద్ద ప్రసంగించిన ఎమ్మెల్యే రోజా పంచ్ డైలాగ్‌లతో ఫైర్ పుట్టించారు. మరోసారి బాహుబలి సినిమాను గుర్తు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రం పాలిట కాలకేయుడిలా తయారయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబుపాలన చూస్తుంటే బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాలన గుర్తుకొస్తోందన్నారు. కాలకేయుడిలా ప్రజల మీద చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారన్నారు. ఈ బల్లాలదేవ పాలనను అంతం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని రోజా అన్నారు. జగన్ ఓ బాహుబలి అన్నారామె.

చంద్రబాబు తన పాలనలో ప్రతి జిల్లాల్లోనూ సూదిగాళ్లను, గాలిగాళ్లను, దూళిగాళ్లను తయారుచేశారని ఆమె మండిపడ్డారు. సైకిల్ పార్టీలో ఉన్నవారంతా సైకోలేనని రోజా మండిపడ్డారు. రోజా ప్రసంగానికి కార్యకర్తలను నుంచి మంచి స్పందన వచ్చింది.

First Published:  7 Oct 2015 10:01 AM GMT
Next Story