గుడుంబా స్థావరాలపై దాడులు… 30 మంది అరెస్ట్‌

 ఇప్పటి దాకా తెలంగాణలోని జిల్లాలకే పరిమితం చేసిన ఎక్సైజ్‌ అధికారుల దాడులు ఇపుడు నగరానికి కూడా విస్తరించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పలు గుడుంబా బట్టీలు బయటపడ్డాయి. ఈ దాడుల్లో భారీగా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 30 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మంది పాత నేరస్థులే ఉన్నారని పోలీసులు తెలిపారు.