Telugu Global
Others

తిరుమల ఘాట్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి కొండ చరియలు విరిగి పడ్డాయి. మంగళవారం కూడా ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీన్ని క్రమబద్దీకరించి ట్రాఫిక్‌ను పునరుద్దరించి ఇంకా 24 గంటలు గడవక ముందే మరోసారి తిరుమల రెండో ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ సిబ్బంది విరిగిపడ్డ కొండచరియలను తొలగిస్తున్నారు. ఈ సంఘటనతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. ఉదయం11 నుంచి 4 గంటల […]

తిరుమల ఘాట్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు
X

తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి కొండ చరియలు విరిగి పడ్డాయి. మంగళవారం కూడా ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీన్ని క్రమబద్దీకరించి ట్రాఫిక్‌ను పునరుద్దరించి ఇంకా 24 గంటలు గడవక ముందే మరోసారి తిరుమల రెండో ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ సిబ్బంది విరిగిపడ్డ కొండచరియలను తొలగిస్తున్నారు. ఈ సంఘటనతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. ఉదయం11 నుంచి 4 గంటల వరకు ఘాట్‌రోడ్డును మూసివేసి కొండచరియలను తొలగించనున్నారు. లింక్‌రోడ్డు ద్వారా వాహనాలను మళ్లించనున్నారు. అయితే ఒకవైపు ప్రయాణం చేస్తున్న వాహనాలు వెనక్కి తిప్పడంలో డ్రైవర్లు ఎన్నో కష్టాలను ఎదుర్కొనున్నారు. రెండు రోజులపాటు ఇలా కొండ చరియలు విరిగి పడడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘాట్‌ రోడ్డును మూడు వారాలపాటు మూసి వేసి ఎక్కడెక్కడ కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందో గుర్తించే పని చేపట్టాలని నిర్ణయించారు. అంటే ఇక మూడు వారాలపాటు ఒకే దారిలో తిరుమలకు రాకపోకలు ఉంటాయన్న మాట.

First Published:  6 Oct 2015 1:05 PM GMT
Next Story