శంకర్‌కి షాకిచ్చిన రోబో విలన్

త్వరలోనే రోబో సినిమాకు సీక్వెల్ తో మనముందుకురావాలనుకుంటున్నాడు దర్శకుడు శంకర్. బాహుబలి సృష్టించిన రికార్డులన్నింటినీ రోబో-2తో క్రాస్ చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా విడుదల చేసి వసూళ్ల వర్షం కురిపించాలనుకుంటున్నాడు. అందుకే రోబో-2లో విలన్ గా మొన్నటివరకు బాలీవుడ్ నటుల గురించి ఆలోచించిన శంకర్.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ నటులపై దృష్టిపెట్టాడు. ఇందులో భాగంగా రోబో-2లో రజనీకాంత్ కు ప్రతినాయకుడిగా నటించే పాత్ర కోసం ఏకంగా ఆర్నాల్ ష్వాజ్ నెగర్ నే శంకర్ సంప్రదించాడని తెలుస్తోంది. అయితే సేమ్ టైం ఆర్నాల్డ్ కూడా శంకర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. రోబో-2లో నటించడానికి ఒప్పుకుంటూనే అలా నటించేందుకు ఏకంగా వంద కోట్ల రూపాయల పారితోషికం అడిగాడట ఆర్నాల్డ్. రోబో నిర్మాణ వ్యయం 3వందల కోట్ల రూపాయలు అనుకుంటే.. అందులో వంద కోట్లు ఆర్నాల్డ్ కే ఇచ్చాయాలి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రచారంపై శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.