Telugu Global
National

వాట్సప్ లో విడాకులు!

కేరళలో ఓ యువకుడు వాట్సప్ లో తలాఖ్.. తలాఖ్ అని చెప్పి సంచలన చర్చకు దారితీశాడు. కేరళలోని  అలప్పజ జిల్లాలోని బెర్తాలకు చెందిన 21 ఏళ్ళ యువతి బీడీఎస్ చదువుతోంది. కొట్టాయం జిల్లాకు చెందిన యువకుడు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనితో  సెప్టెంబర్ లో యువతికి  పెళ్లి జరిగింది. అల్లుడికి 10 లక్షల కట్నంతో పాటు 80 తులాల బంగారం కూడా ఇచ్చారు. పెళ్లైన పది రోజులు కొత్త జంట హ్యాపీగా గడిపారు. ఆ తర్వాత […]

వాట్సప్ లో విడాకులు!
X

కేరళలో ఓ యువకుడు వాట్సప్ లో తలాఖ్.. తలాఖ్ అని చెప్పి సంచలన చర్చకు దారితీశాడు. కేరళలోని అలప్పజ జిల్లాలోని బెర్తాలకు చెందిన 21 ఏళ్ళ యువతి బీడీఎస్ చదువుతోంది. కొట్టాయం జిల్లాకు చెందిన యువకుడు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనితో సెప్టెంబర్ లో యువతికి పెళ్లి జరిగింది. అల్లుడికి 10 లక్షల కట్నంతో పాటు 80 తులాల బంగారం కూడా ఇచ్చారు. పెళ్లైన పది రోజులు కొత్త జంట హ్యాపీగా గడిపారు. ఆ తర్వాత యువకుడు ఉద్యోగానికి అంటూ దుబాయ్ వెళ్లిపోయాడు.
దుబాయ్ వెళ్లిన భర్త నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భార్య ఎన్నోసార్లు ఫోన్ చేసింది. మెస్సేజ్ లు పెట్టింది. అయినా రిప్లై రాలేదు. చివరగా అతని నుంచి వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. నువ్వంటే ఇష్టం లేదు, నాకోసం వెయిట్ చేయొద్దు. ఆపిల్ పండు ఇష్టమని ప్రతి రోజు దాన్నే తినలేము కదా. ఇతర పండ్లను తినాలి కదా. అంటూ తలాఖ్.. తలాఖ్. అని వాట్సప్ లో మెసేజ్ పంపాడు. దీంతో అవాక్కయిన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి మహిళా కమిషన్ ను ఆశ్రయించారు.
ఇంతకూ వాట్సప్ ద్వారా డైవర్స్ చెల్లుతాయా? అది న్యాయసమ్మతమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళా కమిషన్ సభ్యులు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఇస్లాం చట్టాల ప్రకారం తలాఖ్ వర్తిస్తుందని అంటుంటే.. మరికొందరు కొట్టిపారేస్తున్నారు. హజ్ కమిటీ సభ్యుడు మాత్రం వాట్సాప్ మెసేజ్ లీగల్ డాక్యుమెంట్ కాదని, తలాఖ్ అనేది మనిషి ఎదురుగా చెప్పేదని గుర్తు చేశారు. ఈ ఘనటపై దీనిపై కేరళ మహిళా కమీషన్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

First Published:  8 Oct 2015 2:08 AM GMT
Next Story