Telugu Global
Others

కమలనాథన్‌ కమిటీ కాలపరిమితి పెంపు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమల్‌నాథన్‌ కమిటీ కాలపరిమితిని పెంచారు. 2016 మార్చి 31వ తేదీవరకు పెంచుతూ గురువారం కేంద్ర డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగిన తర్వాత రెండు రాష్ర్టాలకు ఉద్యోగుల పంపిణికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కమల్‌నాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. షెడ్యూల్‌ 9, 10లో ఉన్న సంస్థలకు చెందిన ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. కొన్ని టెక్నికల్‌, న్యాయపరమైన అంశాల కారణంగా కొంతమంది […]

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమల్‌నాథన్‌ కమిటీ కాలపరిమితిని పెంచారు. 2016 మార్చి 31వ తేదీవరకు పెంచుతూ గురువారం కేంద్ర డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగిన తర్వాత రెండు రాష్ర్టాలకు ఉద్యోగుల పంపిణికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కమల్‌నాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. షెడ్యూల్‌ 9, 10లో ఉన్న సంస్థలకు చెందిన ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. కొన్ని టెక్నికల్‌, న్యాయపరమైన అంశాల కారణంగా కొంతమంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమల్‌నాథన్‌ కమిటీ ఉద్దేశ్యం నెరవేరలేదు. దీంతో దీని కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించారు.

First Published:  7 Oct 2015 1:13 PM GMT
Next Story