Telugu Global
Others

మెట్రోతో పండగ చేసుకుంటున్న పావురాలు

మెట్రో రైలు హైదరాబాద్‌వాసులకు ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడే చెప్పలేం గానీ పావురాలకు, ఇతర పక్షులకు మాత్రం మెట్రో తెగ నచ్చేస్తోంది. మెట్రో నిర్మాణాన్ని చూసి మురిసిపోతున్నాయి. ఇంతకాలం హైదరాబాద్‌లో పావురాలు, ఇతర పక్షులకు సరైన గూడు ఉండేది కాదు. మసీదులు, పాతబడిన భవనాలు, చెట్ల మీద బిక్కుబిక్కుమంటూ బతికేవి. మనుషులు, పాములు, గద్దలు ఇలా ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందోనని గాడనిద్రకు దూరమై బతికేవి. ఇప్పుడు వాటికా సమస్య తీరింది. మెట్రో లైన్ పుణ్యామాని శాశ్వత, […]

మెట్రోతో పండగ చేసుకుంటున్న పావురాలు
X

మెట్రో రైలు హైదరాబాద్‌వాసులకు ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడే చెప్పలేం గానీ పావురాలకు, ఇతర పక్షులకు మాత్రం మెట్రో తెగ నచ్చేస్తోంది. మెట్రో నిర్మాణాన్ని చూసి మురిసిపోతున్నాయి.

ఇంతకాలం హైదరాబాద్‌లో పావురాలు, ఇతర పక్షులకు సరైన గూడు ఉండేది కాదు. మసీదులు, పాతబడిన భవనాలు, చెట్ల మీద బిక్కుబిక్కుమంటూ బతికేవి. మనుషులు, పాములు, గద్దలు ఇలా ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందోనని గాడనిద్రకు దూరమై బతికేవి. ఇప్పుడు వాటికా సమస్య తీరింది. మెట్రో లైన్ పుణ్యామాని శాశ్వత, సురక్షితమైన నివాసం దొరికింది. మెట్రో పిల్లర్ల మధ్య ఉండే గ్యాపును గూడుగా మలచుకుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాయి.

ఇప్పుడు సరే ట్రైన్ ప్రయాణించడం మొదలయ్యాక… ఆ శబ్ధానికి అవి తట్టుకుంటాయా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే హైదరాబాద్‌లో సౌండ్‌ పొల్యూషన్‌ ఇక్కడి పక్షులకు కొత్తేమీ కాదు. ఎప్పుడో అలవాటు పడ్డాయి. పైగా మెట్రో రైలు మరీ దారుణమైన శబ్దాన్ని కూడా చేయదు. కాబట్టి మెట్రో లైన్‌లో పావురాలు సుఖంగా భార్య పిల్లలతో కాపురం చేసుకోవచ్చన్న మాట .

యజమానుల ఇంటికి వెళ్లే పావురాలైతే పగటి పూట ఓ కునుకు తీసి సాయంత్రం బయలు దేరవచ్చు. పావురాలే కాదు ఇతర పక్షులు కూడా మెట్రోలో పక్కా గృహం కోపం ప్రయత్నిస్తున్నాయి. అయితే పావురాలు, పక్షుల వల్ల మెట్రో మేనేజ్‌మెంట్‌కు మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. అందుకు బెంగళూరు మెట్రోలో జరుగుతున్న తంతును గుర్తు చేస్తున్నారు.

బెంగళూరులోని మెట్రో లైన్లతో పాటు స్టేషన్‌లోనూ నిత్యం వేలాది పావురాలు వచ్చి వాలుతున్నాయి. అలా వచ్చిపోతే ఇబ్బంది లేదు కానీ… అక్కడ పిట్టలు రెట్ట వేసి నానా యాగీ చేస్తున్నాయి. వీటిని శుభ్రం చేయడం సిబ్బందికి ఓ పెద్ద పనిగా తయారైంది. కేవలం పావురాలు రెట్ట వేయడం వల్ల స్టేషన్ శుభ్రం చేసేందుకు హౌజ్ కీపింగ్ చార్జెస్ 30 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని బెంగళూరు మెట్రో అధికారులు చెబుతున్నారు. మరి హైదరాబాద్ మెట్రోలో పావురాల భాగస్వామ్యం ఎలా ఉంటుందో!

First Published:  8 Oct 2015 2:15 AM GMT
Next Story