Telugu Global
Others

రుణమాఫీ రూ. 24 వేల కోట్ల ప్రచారం వెనుక రహస్యం?

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగానీ, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు ఎక్కడికి వెళ్లినా రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేసేశామని పదేపదే చెబుతున్నారు. మొత్తం రైతులందరికీ రుణమాఫీ సొమ్ము ముట్టిందని… మిగిలిన సొమ్ము కూడా తర్వలోనే ఇచ్చేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు.  అయితే ఇప్పటికి ప్రభుత్వం చెబుతున్నట్టు 24 వేల కోట్లు బ్యాంకులకు అందలేదు. అందులో సగం కూడా చేరలేదట. పక్కాగా బ్యాంకుల చేరిన మొత్తం ఏడు వేల కోట్లకు లోపే ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక […]

రుణమాఫీ రూ. 24 వేల కోట్ల ప్రచారం వెనుక రహస్యం?
X

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగానీ, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు ఎక్కడికి వెళ్లినా రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేసేశామని పదేపదే చెబుతున్నారు. మొత్తం రైతులందరికీ రుణమాఫీ సొమ్ము ముట్టిందని… మిగిలిన సొమ్ము కూడా తర్వలోనే ఇచ్చేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికి ప్రభుత్వం చెబుతున్నట్టు 24 వేల కోట్లు బ్యాంకులకు అందలేదు. అందులో సగం కూడా చేరలేదట. పక్కాగా బ్యాంకుల చేరిన మొత్తం ఏడు వేల కోట్లకు లోపే ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందట.

అధికారంలోకి రాగానే మొత్తం రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారం చెప్పారు. అలా చేయడం అసంభవమని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు ప్రచారంతో పనికానిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగో రైతులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయడం ఖాయమన్న నిర్దారణకు టీడీపీ నేతలు వచ్చారట. కాబట్టి వారి సంగతి పక్కన పెట్టి మిగిలిన వర్గాల మీద రుణమాఫీ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకునే కొత్త రకం ప్రచారానికి తెరలేపారని చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు రుణమాఫీ చేయలేదన్న ప్రచారం బాగా జరిగితే… ఉద్యోగులు, విద్యావంతులు, యువత లాంటి వర్గాలన్నీ చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదన్న అభిప్రాయం బలపడుతుంది. దాని వల్ల ఆయా వర్గాల్లోనూ చంద్రబాబు విశ్వసనీయత దెబ్బతిని దాని ప్రభావం పార్టీ గెలుపుపై పడుతుంది. కాబట్టి అదే రుణమాఫీ చేసేశాం.. ఇప్పటికే 24 వేల కోట్లు రైతుల అందేలా చేశాం అని ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, విద్యావంతులు, యువతలో చంద్రబాబు గ్రేట్ అనేలా ఒక కృత్తిమ అభిప్రాయాన్ని కలిగేంచే ఎత్తుగడ ఈ ప్రచారం వెనుక దాగి ఉందంటున్నారు.

అసలు లెక్కలు తెలుసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని దాని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని అంచనాలు వేస్తున్నారు. రైతులు కూడా 24 వేల కోట్ల రుణమాఫీపై తికమక పడడం ఖాయం. ఎందుకంటే నిజంగానే 24 వేల కోట్ల మేర రుణమాఫీ చేశారు కాబోలు… తమకు మాత్రమే తక్కువ సొమ్ము అందిందేమో అంటూ ఒకరికొకరు సంఘటితం అయ్యే అవకాశం కూడా ఉండదు. సో మొత్తం మీద 24 వేల కోట్ల రుణమాఫీ ప్రచారం రైతుల కోసం కాకుండా ఇతర వర్గాల్లో చంద్రబాబు విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకు ఓ పద్దతి ప్రకారం చేస్తున్నారని బ్యాంకు అధికారులు కూడా చెబుతున్నారు.

First Published:  8 Oct 2015 4:52 AM GMT
Next Story