Telugu Global
National

ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై మండిప‌డ్డ శివ‌సేన‌!

దేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై బీజేపీ పాత నేస్తం శివ‌సేన మ‌రోసారి మండిప‌డింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం ఎందుకు నియంత్రించ‌లేక‌పోతోంద‌ని త‌న అధికార ప‌త్రిక సామ్నాలో ధ్వ‌జ‌మెత్తింది. అచ్చే దిన్ ఆయే (మంచి రోజులు రావ‌డం) అంటే ఇదేనా అంటూ మోదీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశిస్తూ ఎగ‌తాళి చేసింది. ప్ర‌స్త‌తం ప‌ప్పులు, గోధుమ‌లు, నూనె, చ‌క్కెర త‌దిత‌రాల ధ‌ర‌లు ఆకాశ‌న్నంటుతున్నా.. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డాన్ని శివ‌సేన తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. న‌లుగురు కుటుంబ స‌భ్యులున్న […]

ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై మండిప‌డ్డ శివ‌సేన‌!
X

దేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై బీజేపీ పాత నేస్తం శివ‌సేన మ‌రోసారి మండిప‌డింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం ఎందుకు నియంత్రించ‌లేక‌పోతోంద‌ని త‌న అధికార ప‌త్రిక సామ్నాలో ధ్వ‌జ‌మెత్తింది. అచ్చే దిన్ ఆయే (మంచి రోజులు రావ‌డం) అంటే ఇదేనా అంటూ మోదీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశిస్తూ ఎగ‌తాళి చేసింది. ప్ర‌స్త‌తం ప‌ప్పులు, గోధుమ‌లు, నూనె, చ‌క్కెర త‌దిత‌రాల ధ‌ర‌లు ఆకాశ‌న్నంటుతున్నా.. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డాన్ని శివ‌సేన తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. న‌లుగురు కుటుంబ స‌భ్యులున్న ఒక ఇంటి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు 5 వేల నుంచి 8 వేల రూపాయ‌ల‌కు పెరిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

అదే విధంగా భార‌త‌దేశ అభివృద్ధిలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ నుంచి మ‌న్మోహ‌న్ సింగ్ వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్ ప్ర‌ధానులు చేసిన కృషిని కొనియాడింది. వారి వ‌ల్ల విదేశాల్లో ఇండియాకు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయ‌ని తెలిపింది. ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో సోనియా గాంధీని ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీ అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించిన విషయాన్ని సామ్నా త‌ప్పుబ‌ట్టింది. విదేశీ గ‌డ్డ‌పై భార‌త్‌లో జ‌రుగుతున్న అవినీతిని లేవ‌నెత్తడంపై ఆక్షేప‌ణ వ్య‌క్తం చేసింది..

First Published:  7 Oct 2015 11:30 PM GMT
Next Story