సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై గ్యాంగ్‌ రేప్‌

హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈమేరకు తనపై జరిగిన అత్యాచారాన్ని వివరిస్తూ బాధితురాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని మాదాపూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. తనపై నిజాంపేటకు చెందిన సంకు రమణ, కాసగోని రాజేష్, కిరణ్ అనే ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరించారని, దాంతో తాను నేరుగా కోర్టులో ఫిర్యాదు చేస్తున్నానని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు.