Telugu Global
NEWS

ఒక్కటైన విపక్షం: ఎల్లుండి తెలంగాణ బంద్‌

రైతులకు సంఘీభావంగా… అన్నదాతల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10 తేదీన బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఏకకాలంలో రైతులకు రుణ మాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేస్తూ ఈ బంద్‌కు పిలుపు ఇచ్చారు. బంద్‌ నేపథ్యంలో ముందురోజు అంటే శుక్రవారం విపక్ష పార్టీలన్నీ కలిసి చార్మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని […]

ఒక్కటైన విపక్షం: ఎల్లుండి తెలంగాణ బంద్‌
X

రైతులకు సంఘీభావంగా… అన్నదాతల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10 తేదీన బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఏకకాలంలో రైతులకు రుణ మాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేస్తూ ఈ బంద్‌కు పిలుపు ఇచ్చారు. బంద్‌ నేపథ్యంలో ముందురోజు అంటే శుక్రవారం విపక్ష పార్టీలన్నీ కలిసి చార్మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని టీపీసీసీ నేత టీటీడీపీ నేత ఎల్‌. రమణ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల సంఖ్యను తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతుందని, బాధిత కుటుంబాలను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. రైతులను విస్మరిస్తున్న కేసీఆర్‌ కాలగర్భంలో కలిసిపోతారని దుయ్యబట్టారు. బంద్‌కు ప్రజలందరూ సహకరించడం ద్వారా రైతులకు సంఘీభావం పలకాలని విపక్ష నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1400 మంది రైతు కుటుంబాలకు పెంచిన ఎక్స్‌గ్రేషియా అక్టోబర్‌ చివరిలోగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండు చేశారు. మీడియా ద్వారా వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు, తెలంగాణ ప్రజలందరూ బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తిండి పెట్టిన రైతు ఏడుస్తున్నాడని తెలంగాణ ప్రజలంతా రైతుకు అండగా ఉండాలని, వారికి ధైర్యం చెప్పాలని ఎల్‌. రమణ పిలుపు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలపై జీవో విడుదల చేసేవరకు రైతుల కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలు రైతుల పక్షాన నిలబడి రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. 10న బంద్‌ నిర్వహించాలని ఇప్పటికే వామపక్షాలు కూడా పిలుపు ఇచ్చినందున దాదాపు అన్ని పార్టీలూ ఈ బంద్‌కు మద్దతుగా నిలిచినట్టయ్యింది.

First Published:  8 Oct 2015 5:00 AM GMT
Next Story