Telugu Global
NEWS

కేసీఆర్ నెక్స్ట్‌ స్టెప్?

అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం నాయకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. ఈ నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేయబోతున్నారు. మంత్రుల్లో ఆందోళన దసరా లోపు […]

కేసీఆర్ నెక్స్ట్‌ స్టెప్?
X

అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం నాయకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. ఈ నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేయబోతున్నారు.
మంత్రుల్లో ఆందోళన
దసరా లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ్టి భేటీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు కొందరు మంత్రులను తొలగిస్తారన్న ప్రచారంతో ఆందోళన నెలకొంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఈనెల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పార్టీ వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. బైపోల్స్ లో వరంగల్ ఎంపీ స్థానంతో పాటు, నారాయణ్ ఖేడ్ స్థానాన్ని కూడా దక్కించుకోవడమే లక్ష్యంగా గులాబీదళం ప్రణాళికలు సిద్ధం చేయబోతోంది.
నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ
ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఈ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇస్తారని నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో దసరాలోపే వీటిని వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు ఆలయ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై చర్చించనున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో దీనిపైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించే అవకాశాలున్నాయి.

First Published:  8 Oct 2015 3:20 AM GMT
Next Story