Telugu Global
Others

టీడీపీకి రేవంత్ షాకిస్తారా?

తెలంగాణ టీడీపీలో కీలక నాయకుడిగా మారిపోయిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఆపార్టీకి షాక్ ఇస్తారా? రేవంత్ భవిష్యత్ నిర్ణయం చంద్రబాబును కూడా షాక్ కు గురిచేయబోతోందా? అవునన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. దీనికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్న వాదనా ఉంది. ఇటీవల చంద్రబాబు రేవంత్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా  బాధ్యతలు ఇచ్చారు. అయితే తనకు అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన రేవంత్ బాబు నిర్ణయంపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.  దీనికి తోడు […]

టీడీపీకి రేవంత్ షాకిస్తారా?
X
తెలంగాణ టీడీపీలో కీలక నాయకుడిగా మారిపోయిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఆపార్టీకి షాక్ ఇస్తారా? రేవంత్ భవిష్యత్ నిర్ణయం చంద్రబాబును కూడా షాక్ కు గురిచేయబోతోందా? అవునన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. దీనికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్న వాదనా ఉంది. ఇటీవల చంద్రబాబు రేవంత్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు ఇచ్చారు. అయితే తనకు అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన రేవంత్ బాబు నిర్ణయంపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
దీనికి తోడు కొందరు సీనియర్ నేతలు మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన మాజీ టీడీపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కూడా రేవంత్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. ఇదంతా పార్టీలో తనంటే గిట్టని కొందరు నేతల పనేనని రేవంత్ భావిస్తున్నారట. ఒకవేళ నాగం టీడీపీలోకి తిరిగి వస్తే తనదారి తాను చూసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అటు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు కూడా రేవంత్ రాకకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
నిజానికి ఇప్పటికీ కాంగ్రెస్ లోని కీలక నేతలతో రేవంత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే తనకున్న పరిచయాలతో రేవంత్ తన నియోజకవర్గానికి భారీగా నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
First Published:  8 Oct 2015 1:05 AM GMT
Next Story