Telugu Global
Others

త్వరలో యుద్ధ విమాన పైలెట్లుగా మహిళలు

ఇకపై ప్రత్యక్ష యుద్ధ రంగంలో మహిళల సేవలు వినియోగించుకునే రోజు త్వరలోనే ఉంటుందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ ప్రకటించారు. 83వ వాయు దళ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలను నేరుగా యుద్ధంలో దించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ నిరాకరించిందని, శత్రువులకు చిక్కితే వారు పెట్టే హింసలు భరించలేరన్న కారణంతో వీరిని కేవలం రవాణా విమానాలకు, హెలికాప్టర్లకే పరిమితం చేసిందని చెప్పారు. అయితే ఇపుడు మహిళలను కూడా ఫైటర్‌ విమానాల్లో పైలెట్లుగా నియోగించేందుకు అనుమతి కోరుతూ […]

ఇకపై ప్రత్యక్ష యుద్ధ రంగంలో మహిళల సేవలు వినియోగించుకునే రోజు త్వరలోనే ఉంటుందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ ప్రకటించారు. 83వ వాయు దళ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలను నేరుగా యుద్ధంలో దించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ నిరాకరించిందని, శత్రువులకు చిక్కితే వారు పెట్టే హింసలు భరించలేరన్న కారణంతో వీరిని కేవలం రవాణా విమానాలకు, హెలికాప్టర్లకే పరిమితం చేసిందని చెప్పారు. అయితే ఇపుడు మహిళలను కూడా ఫైటర్‌ విమానాల్లో పైలెట్లుగా నియోగించేందుకు అనుమతి కోరుతూ భారత ప్రభుత్వాన్ని కోరామని, ఈ అంశంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపారు. దీనికి ఆమోదం తెలిపితే మహిళలు యుద్ధ విమానాలకు కూడా పైలెట్లుగా వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

First Published:  7 Oct 2015 1:12 PM GMT
Next Story