Telugu Global
NEWS

ఆశావర్కర్ల ఆందోళన... ఎక్కడికక్కడ అరెస్ట్‌లు

తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమానికి తరలివస్తున్న ఆశాలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ… ఇలా చాలా పట్టణాల్లో వందలాది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు గంటల తరబడి పోలీసు స్టేషన్లలోనే నిర్బంధించారు. నగరంలో కూడా ఆల్వాల్‌, కవాడీగూడ, ఎల్‌బి నగర్‌ ప్రాంతంల్లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీఎం డౌన్‌ డైన్‌ […]

ఆశావర్కర్ల ఆందోళన... ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
X
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమానికి తరలివస్తున్న ఆశాలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ… ఇలా చాలా పట్టణాల్లో వందలాది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు గంటల తరబడి పోలీసు స్టేషన్లలోనే నిర్బంధించారు. నగరంలో కూడా ఆల్వాల్‌, కవాడీగూడ, ఎల్‌బి నగర్‌ ప్రాంతంల్లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీఎం డౌన్‌ డైన్‌ అంటూ వారు నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కళ్ళుగప్పి ఇందిరా పార్క్‌ వద్దకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి ఘోషామహల్‌కు తరలించారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో ఆశా వర్కర్లు గాయపడ్డారు.
బంగారు తెలంగాణ కోసం పోరాడి… భవిష్యత్తును బాగుచేసుకుందామని చెప్పిన కేసీఆర్‌కు ఇపుడు కనీస వేతనాల కోసం ఉద్యమిస్తున్న తాము కనపడడం లేదని ఆశా వర్కర్లు ఆరోపించారు. తమకు కనీస వేతనం రూ. 15 వేలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. ఆశా వర్కర్లు అంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందని… కేసీఆర్‌కు తాము ఆడబిడ్డలం కాదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాలు ఉండవని అందరూ సుఖసంతోషాలతో ఉంటామని ఆనాడు కేసీఆర్‌ అన్న మాటలను వారు గుర్తు చేశారు. తమ ఉద్యమాన్ని అణచివేసి… అరెస్టులు చేసినా ఆందోళన ఆగదని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. మరోవైపు… నగరంలోని మగ్ధుం భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వస్తూ చలో అసెంబ్లీకి బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు మండిపడుతూ శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు.
First Published:  9 Oct 2015 4:36 AM GMT
Next Story