రకుల్ పారితోషికం ఎంతో తెలుసా…?

సక్సెస్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి… క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి.. ఏమాత్రం మొహమాటపడినా అంతే సంగతులు. ఈ విషయాన్ని తొందరగానే గ్రహించింది రకుల్ ప్రీత్ సింగ్. లౌక్యం సక్సెస్ నుంచి క్రమక్రమంగా తన పారితోషికం పెంచుకుంటూ పోతున్న ఈ భామ.. తాజాగా కళ్లుచెదిరే రెమ్యునరేషన్ అందుకుంటోందని సమాచారం. తాజా లెక్కల ప్రకారం ఆమె సినిమాకు కోటిన్నర రూపాయలు ఛార్జ్ చేస్తోందని ఫిలింనగర్ టాక్. రవితేజతో చేసిన కిక్-2 సినిమా కు కోటిన్నర కంటే కాస్త తక్కువ తీసుకున్న ఈ భామ.. ఆ తర్వాత చేసిన బ్రూస్ లీ సినిమాకు కోటిన్నర కచ్చితంగా తీసుకుందని అంటున్నారు. అంతేకాదు.. అల్లు అర్జున్ కొత్త సినిమా సరైనోడు లో కూడా నటించేందుకు కోటిన్నర అందుకుందని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకు కూడా అంతే పారితోషికం అందుకుందట. మొత్తంగా చూసుకుంటే.. ఈ 3 సినిమాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల్ని పారితోషికంగా అందుకుందని అంటున్నారు.