అగ్రిగోల్డ్‌పై ముగ్గురు సభ్యులతో హైకోర్టు కమిటీ

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి  హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వీరి నేతృత్వంలో ఆస్తుల విక్రయాలు, బాధితులకు చెల్లింపులు జరగాలని సూచించింది. అగ్రిగోల్డ్‌కు ఎన్ని ఆస్తులున్నాయో, ఎన్ని ఆస్తులు వివాదంలో ఉన్నాయో పరిశీలించి క్లియర్‌ టైటిల్‌తో ఉన్న ఆస్తులన్నీ విక్రయించి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించింది. కమిటీ పర్యవేక్షణలోనే ఆస్తుల విక్రయాలు జరగాలని పేర్కొంది. ఐదు ఆస్తుల విక్రయాలపై 26లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. త్రిసభ్య కమిటీకి అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ తదితర యాజమాన్య సభ్యులు సహకరించాలని ఆదేశించింది.