Telugu Global
CRIME

సౌదీలో పని మనిషి చేయి నరికేశారు!

నాలుగు డబ్బులు సంపాదించుకుని కుటుంబానికి ఆసరాగా నిలుద్దామని ఆశ పడిన ఓ మహిళ… సౌదీ అరేబియాలో పడిన కష్టాలకు ఎవరి కళ్ళలోనైనా కన్నీళ్ళు తిరగాల్సిందే. మూడు నెలల క్రితం తమిళనాడు నుంచి కస్తూరి మునిరత్నం (58) అనే మహిళ ఓ ఏజంట్‌ ద్వారా సౌదీ అరేబియా వెళ్ళింది. అక్కడ ఓ ఇంట్లో పని మనిషిగా కుదిరింది. అప్పటి నుంచి ఆమెకు గతంలో చూడని కష్టాలు ఎదురయ్యాయి. దాదాపు ఇరవై గంటలు పని… ఆటవిడుపుగా కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు […]

సౌదీలో పని మనిషి చేయి నరికేశారు!
X
నాలుగు డబ్బులు సంపాదించుకుని కుటుంబానికి ఆసరాగా నిలుద్దామని ఆశ పడిన ఓ మహిళ… సౌదీ అరేబియాలో పడిన కష్టాలకు ఎవరి కళ్ళలోనైనా కన్నీళ్ళు తిరగాల్సిందే. మూడు నెలల క్రితం తమిళనాడు నుంచి కస్తూరి మునిరత్నం (58) అనే మహిళ ఓ ఏజంట్‌ ద్వారా సౌదీ అరేబియా వెళ్ళింది. అక్కడ ఓ ఇంట్లో పని మనిషిగా కుదిరింది. అప్పటి నుంచి ఆమెకు గతంలో చూడని కష్టాలు ఎదురయ్యాయి. దాదాపు ఇరవై గంటలు పని… ఆటవిడుపుగా కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు అనిపిస్తే చిత్రహింసలు… కడుపు నిండా తిండి లేదు… ఇదేమని అడిగిన పాపానికి కొరడా దెబ్బల నజరాన… ఈ దారుణ పరిస్థితిని తట్టుకోలేని ఆమె ఆ ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే దేశం కాని దేశం… కొంత సేపటికే దొరికేసింది. బలవంతంగా మళ్ళీ ఇంటికి తీసుకుపోయారు. అక్కడితో వదిలేయలేదు. ఆమె కుడి చేతిని నరికేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆమెపై ఉద్యోగి. ఈ విషయం ఏజెంట్‌ ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కస్తూరిని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు. కస్తూరిని స్వదేశం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ కనిమొళి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌కు లేఖ రాశారు. ఈ విషయం తెలుసుకున్న సుష్మ ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని, కస్తూరిని తీసుకురావడానికి సౌదీ అధికారులతో మాట్లాడుతున్నామని చెబుతూ ట్వీట్‌ చేశారు.
First Published:  8 Oct 2015 3:07 PM GMT
Next Story