Telugu Global
National

ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట !

మహిళలపై జరుగుతున్న రేప్‌లపై కర్నాటక హోంమంత్రి కేజే జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళపై ఇద్దరు వ్యక్తులు చేసే లైంగిక దాడిని గ్యాంగ్ రేప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నలుగురైదుగురు చేస్తే దాని గ్యాంగ్ రేప్ అనవచ్చని… అలా కాకుండా ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ అని ఎలా అవుతుందని మీడియాను ప్రశ్నించి ఆశ్చర్యపరిచారు.అలా ప్రచారం చేయడం సరికాదని సలహా ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్, మరో వ్యక్తి […]

ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట !
X

మహిళలపై జరుగుతున్న రేప్‌లపై కర్నాటక హోంమంత్రి కేజే జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళపై ఇద్దరు వ్యక్తులు చేసే లైంగిక దాడిని గ్యాంగ్ రేప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నలుగురైదుగురు చేస్తే దాని గ్యాంగ్ రేప్ అనవచ్చని… అలా కాకుండా ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ అని ఎలా అవుతుందని మీడియాను ప్రశ్నించి ఆశ్చర్యపరిచారు.అలా ప్రచారం చేయడం సరికాదని సలహా ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్, మరో వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనపై మాట్లాడుతూ కేజే జార్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారు కారులో మూడు గంటల పాటు తిప్పుతూ ఉద్యోగినిపై అత్యాచారం చేశారు. కర్నాటక హోంమంత్రి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తివ్రంగా మండిపడ్డారు. నేతల అజ్ఞానానికి కర్నాటక హోంమంత్రి వ్యాఖ్యలు మరో ఉదాహరణ అని విమర్శించారు.

First Published:  8 Oct 2015 3:09 PM GMT
Next Story