Telugu Global
National

ఆయనో సైతాన్‌... ఆయనో బ్రహ్మ పిశాచి

… ఇది బీహార్‌లో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు. మొన్నటికి మొన్న రాష్ట్రీయ జనతా దళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జనాన్ని పట్టి పీడించే సైతాన్‌ అని, ఒకసారి ఈ సైతాన్‌ను తరిమికొట్టినా మళ్ళీ రాష్ట్రంలోకి రావడానికి ఈ సైతాన్‌ ప్రయత్నం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించారు. దీనిపై లాలూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నేను సైతాన్‌ అయితే మరి మోడి ఏమిటి? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం కూడా ఆయనే […]

ఆయనో సైతాన్‌... ఆయనో బ్రహ్మ పిశాచి
X
… ఇది బీహార్‌లో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు. మొన్నటికి మొన్న రాష్ట్రీయ జనతా దళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జనాన్ని పట్టి పీడించే సైతాన్‌ అని, ఒకసారి ఈ సైతాన్‌ను తరిమికొట్టినా మళ్ళీ రాష్ట్రంలోకి రావడానికి ఈ సైతాన్‌ ప్రయత్నం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించారు. దీనిపై లాలూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నేను సైతాన్‌ అయితే మరి మోడి ఏమిటి? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం కూడా ఆయనే చెప్పేశారు. మోడీ పెద్ద బ్రహ్మ పిశాచి అని లాలూ ప్రత్యారోపణ చేశారు. ఈ బ్రహ్మ పిశాచిని ఎలా సాగనంపాలో తమకు బాగా తెలుసునని ఆయన అన్నారు. నిజానికి ప్రధాని పదవికి నరేంద్ర మోడి అర్హుడు కాదని ఆయన అన్నారు. దాద్రి సంఘటనకు సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సహనం, శాంతి యుత సందేశం ఇచ్చేవరకు మోడీ స్పందించలేక పోవడాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత అసమర్ధుడో అర్దమవుతుందని ఘాటుగా విమర్శించారు. సరే… ఇన్ని విమర్శలు చేసిన లాలూ కొసమెరుకో మాట అన్నారు. తనను సైతాన్‌ అన్నందుకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారట. మరి బ్రహ్మ పిశాచి అన్నందుకు మోడి ఏం చేయాలి?!
First Published:  9 Oct 2015 3:03 AM GMT
Next Story