Telugu Global
National

సెల్ఫీ దెబ్బ- చెంప అంది అబ్బా!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయకుడు స్టాలిన్ మరోసారి సహనం కోల్పోయాడు. సెల్పీ ఫ్లీజ్ అన్న ఓ అభిమాని చెంప చెల్లుమనిపించారు. కాలర్ పట్టుకుని వెనక్కు తోసేశారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరీస్ జిల్లాలో బుధవారం రాత్రి డీఎంకే నిర్వహించిన ఓ కార్యక్రమంలో జరిగింది. అక్కడికి వచ్చిన స్టాలిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఓ ఆటో డ్రైవర్ ముందుకొచ్చారు. ఫోన్ తీసి ఫోజు ఇస్తుండగానే స్టాలిన్ కోపంతో ఆటో డ్రైవర్ చెంప చెల్లుమనిపించారు. వెనక్కు తోసిపారేశారు. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో […]

సెల్ఫీ దెబ్బ- చెంప అంది అబ్బా!
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయకుడు స్టాలిన్ మరోసారి సహనం కోల్పోయాడు. సెల్పీ ఫ్లీజ్ అన్న ఓ అభిమాని చెంప చెల్లుమనిపించారు. కాలర్ పట్టుకుని వెనక్కు తోసేశారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరీస్ జిల్లాలో బుధవారం రాత్రి డీఎంకే నిర్వహించిన ఓ కార్యక్రమంలో జరిగింది. అక్కడికి వచ్చిన స్టాలిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఓ ఆటో డ్రైవర్ ముందుకొచ్చారు. ఫోన్ తీసి ఫోజు ఇస్తుండగానే స్టాలిన్ కోపంతో ఆటో డ్రైవర్ చెంప చెల్లుమనిపించారు. వెనక్కు తోసిపారేశారు. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన కొందరు సోషల్ మీడియాలోకి వదిలేశారు.

కొన్ని నెలల క్రితం కూడా స్టాలిన్ మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. రైలులో పక్కకు జరగడం లేదంటూ చెంపదెబ్బ కొట్టారు. అప్పట్లో స్టాలిన్ ప్రవర్తనపై దుమారం రేగింది. అయినా స్టాలిన్ తీరు మారలేదు.

https://www.youtube.com/watch?feature=player_embedded&v=gfoSn9srt68

First Published:  9 Oct 2015 4:37 AM GMT
Next Story