Telugu Global
Others

అన్న‌పూర్ణ అప్పుల రాజ్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం అప్పుల కుప్ప‌గా మారుతోంది. వ్యాపార అవ‌కాశాల‌కు అత్యంత అనుకూల‌మైన రాష్ర్టంగా ప్ర‌పంచ‌బ్యాంకు ఇచ్చిన రెండో స్థానం చూసి మురిసిపోతున్న బాబు గారు త‌న జ‌మానాలో ఖ‌జానా ఎలా ఖాళీ అవుతుందో గ‌మ‌నించ‌డంలేద‌ని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వైపు ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌ని హామీలకు ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం. మ‌రో వైపు ఆదాయం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఆదాయానికి మించి ఖ‌ర్చులు ఎక్కువ కావ‌డంతో ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. అక్టోబరులో తొలి […]

అన్న‌పూర్ణ అప్పుల రాజ్యం
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం అప్పుల కుప్ప‌గా మారుతోంది. వ్యాపార అవ‌కాశాల‌కు అత్యంత అనుకూల‌మైన రాష్ర్టంగా ప్ర‌పంచ‌బ్యాంకు ఇచ్చిన రెండో స్థానం చూసి మురిసిపోతున్న బాబు గారు త‌న జ‌మానాలో ఖ‌జానా ఎలా ఖాళీ అవుతుందో గ‌మ‌నించ‌డంలేద‌ని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వైపు ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌ని హామీలకు ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం. మ‌రో వైపు ఆదాయం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఆదాయానికి మించి ఖ‌ర్చులు ఎక్కువ కావ‌డంతో ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. అక్టోబరులో తొలి ఎనిమిది రోజుల్లోను రూ.950 కోట్లు ఆదాయం రాగా, రూ.3370 కోట్లు ఖ‌ర్చ‌య్యింది. 2400 కోట్లు లోటు ఉండ‌గా..దీనిని గ‌త ఆదాయంతో కొంత భ‌ర్తీ చేశారు. చివ‌రికి 900 కోట్ల‌కు అప్పు మిగిలింది. ఈ మొత్తంలో 770 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్జ‌స్ట్‌మెంట్‌లో ఉండ‌గా.. మిగిలిన మొత్తం ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌గా మిగిలింది. శనివారం, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో స‌ర్కారు ఖ‌జానాకు జ‌మ‌య్యే మొత్తాలు ఏమీ ఉండ‌వ‌ని, దీంతో సోమ‌వారం వ‌ర‌కూ ఓవ‌ర్‌డ్రాఫ్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మ‌ని ఆర్థిక శాఖ అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
బిల్లుల‌కు చిల్లులు
ఖ‌జానా ఖ‌ల్లాస్ కావ‌డంతో బిల్లుల‌కు చిల్లులు పెట్ట‌డం మొద‌లెట్టారు. ఆర్థిక ప‌రిస్థితి ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌లో కొన‌సాగుతుండ‌టంతో ఆర్థిక‌శాఖ క‌త్తెర‌కు ప‌దునుపెట్టింది. నియంత్ర‌ణ స్పీడ్ బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. వివిధ శాఖ‌ల‌కు జ‌ర‌గాల్సిన చెల్లింపుల‌పై నిశితంగా ప‌రిశీలిస్తూ .. ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తోంది. ఒక్క అత్య‌వ‌స‌ర బిల్లులు మిన‌హాయించి..మిగ‌తా అన్ని శాఖ‌ల నుంచి వ‌చ్చే బిల్లులు చెల్లింపులు నిలిపేయాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఓవ‌ర్‌డ్రాఫ్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక మిగిలిన బిల్లులు క్లియ‌ర్ చేయాల‌ని ఉన్న‌త‌స్థాయి నుంచి ఆదేశాలున్నాయ‌ని ఆర్థిక‌శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదాయం మూరెడు..జీతాలు బారెడు
ఆదాయం మూరెడు..జీతాలు బారెడు అన్న చందంగా మారింది ఏపీ ప‌రిస్థితి. ఒక్క జీతాల‌కే 2200 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. ఇన్‌పుట్ స‌బ్సిడీతోపాటు అత్య‌వ‌స‌రాల‌కు నిధులు విడుదల చేశామ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ కార‌ణాల‌తోనే ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు. దీనికి అద‌నంగా మంత్రులు, అధికారుల విదేశీ టూర్‌లు.. ఖ‌ర్చులు ఖ‌జానాపై భారంగా మారింద‌ని చెబుతున్నారు.

First Published:  10 Oct 2015 12:14 PM GMT
Next Story