Telugu Global
Others

ట్రూ జెట్..... ఫేయిల్డ్ సర్వీసెస్

మెగా హీరో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభంలోనే చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. దారుణమైన సర్వీస్ అందిస్తున్న ఎయిర్‌లైన్స్ జాబితాలో  రెండో స్థానంలో నిలిచింది. ప్రయాణికుల నుంచి అత్యధిక స్థాయిలో ఫిర్యాదులు కూడా  చరణ్ ఎయిర్‌లైన్స్ మీదే వస్తున్నాయి.   డీజీసీఏ నివేదిక ప్రకారం ఎప్పుడుపడితే అప్పుడు సర్వీస్‌ను రద్దు చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ పెగాసస్ తర్వాత చరణ్‌కు చెందిన ట్రూ జెట్‌ ఉంది. ప్రయాణికుల ఫిర్యాదులైతే ట్రూజెట్‌పై అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ట్రూజెట్ […]

ట్రూ జెట్..... ఫేయిల్డ్ సర్వీసెస్
X
మెగా హీరో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభంలోనే చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. దారుణమైన సర్వీస్ అందిస్తున్న ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రయాణికుల నుంచి అత్యధిక స్థాయిలో ఫిర్యాదులు కూడా చరణ్ ఎయిర్‌లైన్స్ మీదే వస్తున్నాయి.
డీజీసీఏ నివేదిక ప్రకారం ఎప్పుడుపడితే అప్పుడు సర్వీస్‌ను రద్దు చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ పెగాసస్ తర్వాత చరణ్‌కు చెందిన ట్రూ జెట్‌ ఉంది. ప్రయాణికుల ఫిర్యాదులైతే ట్రూజెట్‌పై అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ట్రూజెట్ హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని ప్రతికూల వాతావరణాన్ని కారణంగా చూపుతూ రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతి వెళ్లేందుకు మరో విమానానైనా సమకూర్చాలని ప్రయాణికులు ఆందోళన చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది కూడా సాధ్యం కాలేదు.
ట్రూ జెట్‌ సర్వీసుల కాన్సిలేషన్ ఆగస్టు నెలలో ఐదు శాతానికి మించి ఉంది. జులై నెలలో ఎయిర్ కోస్తా సర్వీసుల రద్దు అత్యధికంగా ఉంది. అయితే దీనిపై ట్రూజెట్ అధికారులను సంప్రదించగా ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయని… త్వరలోనే అద్భుతమైన సర్వీస్ అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మెరుగైన సర్వీసులు అందిస్తున్న సంస్థలు కూడా ప్రారంభంలో పడ్డ ఇబ్బందులు, ఎదుర్కొన్న విమర్శలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే స్థాయిలో సర్వీసులు అందిస్తామని హామీ ఇస్తున్నారు.
First Published:  9 Oct 2015 9:48 PM GMT
Next Story