Telugu Global
Cinema & Entertainment

డైరెక్టర్‌తో అశ్వనీదత్ కూతురి ప్రేమ వివాహం

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. డైరెక్టర్‌తో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నారు. ఎవడే సుబ్రమణ్యం మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌, ప్రియాంక దత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నారు. వెంటనే తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇద్దరి అభిప్రాయాలు చాలా […]

డైరెక్టర్‌తో అశ్వనీదత్ కూతురి ప్రేమ వివాహం
X

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. డైరెక్టర్‌తో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నారు. ఎవడే సుబ్రమణ్యం మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌, ప్రియాంక దత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు. ప్రియాంకే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందన్నారు. వెంటనే తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇద్దరి అభిప్రాయాలు చాలా విషయాల్లో కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. వివాహానికి రెండు కుటుంబాలు కూడా అంగీకరించాయని వెల్లడించారు. పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రియాంక దత్ అమెరికాలో డైరెక్షన్‌కు సంబంధించి శిక్షణ తీసుకున్నారు.

First Published:  10 Oct 2015 9:32 AM GMT
Next Story