Telugu Global
CRIME

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

విశాఖ పోలీసులు ఏడుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. పోలీసులమని చెప్పి బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులను గుర్తించిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, రెండు లక్షల నగదుతోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెద్దవాల్తేరు ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు తారస పడ్డారు. అనుమానాస్పదంగా తడ్చాడుతున్న వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు […]

విశాఖ పోలీసులు ఏడుగురు అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. పోలీసులమని చెప్పి బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులను గుర్తించిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, రెండు లక్షల నగదుతోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెద్దవాల్తేరు ప్రధాన రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు తారస పడ్డారు. అనుమానాస్పదంగా తడ్చాడుతున్న వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. వీరు 5 జిల్లాల పరిధిలో మొత్తం 19 చోట్ల దొంగతనాలు చేసినట్టు తెలిపారు.

First Published:  9 Oct 2015 3:06 PM GMT
Next Story