Telugu Global
Others

జగన్‌కు విజయమ్మ పరామర్శ... నాలుగో రోజుకు దీక్ష

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ దీక్ష స్థలికి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా దీక్ష కారణంగా వైఎస్ జగన్ నీరసంగా కనిపిస్తున్నారని, ఆయన పల్స్ రేటు కూడా గంట గంటకు పడిపోతోందని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు […]

జగన్‌కు విజయమ్మ పరామర్శ... నాలుగో రోజుకు దీక్ష
X

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ దీక్ష స్థలికి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా దీక్ష కారణంగా వైఎస్ జగన్ నీరసంగా కనిపిస్తున్నారని, ఆయన పల్స్ రేటు కూడా గంట గంటకు పడిపోతోందని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఉదయం గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పల్స్‌ రేటులో తేడా వస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం జగన్ బీపీ 129/90, షుగర్ 87, పల్స్‌రేట్‌ 66, బరువు 74.1 (ఈ మూడు రోజుల్లో 1.4 కిలోలు తగ్గారు) ఉంది. వైఎస్‌ జగన్‌కు మద్దతుగా భారీగా యువతీ యువకులు తరలివచ్చారు. దీక్ష శిబిరానికి మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా పోటెత్తారు. మరోవైపు వైఎస్ జగన్‌ చేస్తున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలుచోట్ల ప్రజలు, నేతలు… స్వచ్ఛందంగా దీక్షకు మద్దతుగా దీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకహోదా కోసం దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందంటున్నారు విద్యార్థినిలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక దీక్షకి కూర్చున్న ఆయనను పలువురు విద్యార్థినీ విద్యార్థులు కలిసి సంఘీభావం తెలిపారు.
జగన్‌ దీక్షకు మద్దతుగా పలు చోట్ల ర్యాలీలు
వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు, మహిళలు ,రైతులు పెద్ద సంఖ్యలో దీక్ష స్థలికి వచ్చి జగన్‌కు మద్దతు తెలిపారు. జగన్‌కు మద్దతుగా రాజంపేటలో మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. అదేవిదంగా విశాఖలో జగన్‌ దీక్షకు మద్దతుగా ఆరిలోవ, మల్కాపురం, గాజువాకలో వైసీపీ ర్యాలీలు నిర్వహించింది. చంద్రబాబు సింగపూర్ లాంటి కలలు కనడం మానేసి ప్రత్యేకహోదా ను రాబట్టుకోవాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం జగన్‌ దీక్ష చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా, ప్రత్యేక హోదా సాధించేందుకు తామంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ అంశంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడపలో ప్రశ్నించారు.

First Published:  10 Oct 2015 12:59 AM GMT
Next Story