Telugu Global
NEWS

వాచ్‌మెన్‌గా సై అంటున్న "ఎంబీఏ" కుర్రాళ్లు

పోస్ట్ వస్తే చాలు పోజిషన్‌తో పనిలేదంటోంది నిరుద్యోగం. పెద్దపెద్ద చదువు చదివినా సరే ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి ఏదో ఒకటి చేసేందుకు రెడీ అంటోంది యువత. విశాఖలో వాచ్‌మెన్‌ పోస్టుల నోటిఫికేషన్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈస్ట్రన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆరు వాచ్ మెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తెలుగు చదవడం, రాయడం వచ్చి 35 ఏళ్లు మించకపోతే చాలు ఉద్యోగానికి అర్హులేనని ప్రకటించింది. దాదాపు రెండు వేల మంది […]

వాచ్‌మెన్‌గా సై అంటున్న ఎంబీఏ కుర్రాళ్లు
X

పోస్ట్ వస్తే చాలు పోజిషన్‌తో పనిలేదంటోంది నిరుద్యోగం. పెద్దపెద్ద చదువు చదివినా సరే ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి ఏదో ఒకటి చేసేందుకు రెడీ అంటోంది యువత. విశాఖలో వాచ్‌మెన్‌ పోస్టుల నోటిఫికేషన్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈస్ట్రన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఆరు వాచ్ మెన్‌ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తెలుగు చదవడం, రాయడం వచ్చి 35 ఏళ్లు మించకపోతే చాలు ఉద్యోగానికి అర్హులేనని ప్రకటించింది. దాదాపు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అప్లికేషన్లను తెరిచి చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. అందులో సగానికి పైగా ఉన్నత చదువులు చదివిన వారే . ఎక్కువగా బీటెక్, ఎంబీఏ, బీబీఎం, డీగ్రీలు చదివిన వారున్నారు. పెద్దగా విద్యార్హత అవసరం లేని వాచ్ మెన్ పోస్టులకు ఇలా ఉన్నతవిద్యావంతులు దరఖాస్తు చేసుకోవడం చూసి అధికారులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన నిరుద్యోగ తీవ్రతకు అద్దంపడుతోందంటున్నారు. చివరకు అధికారులు 317 మంది దరఖాస్తుదారులకు హాల్ టికెట్లు పంపి భర్తీ పక్రియను నడిపించారు.

First Published:  10 Oct 2015 7:24 AM GMT
Next Story