Telugu Global
Others

ప్రభుత్వాల్ని శాసిస్తున్న మైనారిటీ మతాలు

భారతదేశంలో ఆలయాలు ఈ దుస్థితిలో ఉండడానికి నికృష్ణ రాజకీయాలే కారణమని శారదాపీఠం అధిపతి స్వారూపానంద ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాదాయ శాఖలు ఉండి కూడా ప్రయోజనం లేదని, అసలు ఆలయాలపై పెత్తనానికి అవి దూరంగా ఉంటే మంచిదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మైనార్టీ మతాలు శాసిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం ఎందుకు పోరాటం చేయడంలేదని నిలదీశారు. దేవాలయాల పరిరక్షణపై విశాఖలో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత వ్యవస్థలో రాజకీయ నిరుద్యోగులకు […]

భారతదేశంలో ఆలయాలు ఈ దుస్థితిలో ఉండడానికి నికృష్ణ రాజకీయాలే కారణమని శారదాపీఠం అధిపతి స్వారూపానంద ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాదాయ శాఖలు ఉండి కూడా ప్రయోజనం లేదని, అసలు ఆలయాలపై పెత్తనానికి అవి దూరంగా ఉంటే మంచిదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మైనార్టీ మతాలు శాసిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం ఎందుకు పోరాటం చేయడంలేదని నిలదీశారు. దేవాలయాల పరిరక్షణపై విశాఖలో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత వ్యవస్థలో రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఆలయాలకు ప్రభుత్వం రక్షణగానే ఉండాలి తప్ప పెత్తనం చేయకూడదని స్వరూపానంద హితవు పలికారు.

First Published:  9 Oct 2015 1:11 PM GMT
Next Story