Telugu Global
Others

12 కోట్ల‌ ధారాద‌త్తానికి బాబు 'మాస్ట‌ర్‌ప్లాన్‌'

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జారాజ‌ధాని కోసం సింగపూర్ ఉచితంగానే మాస్టర్ ప్లాన్ అందజేసిందని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. త‌న విజ‌న్, అభివృద్ధి ప్లానింగ్ న‌చ్చే బాబు మీకిది ఫ్రీ ఫ్రీ అని చెప్పి మాస్ట‌ర్ ప్లాన్ తయారుచేసి చేతిలో పెట్టేశార‌ని నారావారు తెగ ఊద‌ర‌గొట్టారు. నేనంటే ఏమనుకున్నారు? నా పని తనానికి, నా పాలనా సామర్ధ్యానికి మెచ్చి సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చింది. అదీ పరిపాలనా అనుభవం అంటే అని ఇటీవలే టీవీలలో ఊదరగొట్టాడు బాబు, కానీ […]

12 కోట్ల‌ ధారాద‌త్తానికి బాబు మాస్ట‌ర్‌ప్లాన్‌
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జారాజ‌ధాని కోసం సింగపూర్ ఉచితంగానే మాస్టర్ ప్లాన్ అందజేసిందని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. త‌న విజ‌న్, అభివృద్ధి ప్లానింగ్ న‌చ్చే బాబు మీకిది ఫ్రీ ఫ్రీ అని చెప్పి మాస్ట‌ర్ ప్లాన్ తయారుచేసి చేతిలో పెట్టేశార‌ని నారావారు తెగ ఊద‌ర‌గొట్టారు. నేనంటే ఏమనుకున్నారు? నా పని తనానికి, నా పాలనా సామర్ధ్యానికి మెచ్చి సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చింది. అదీ పరిపాలనా అనుభవం అంటే అని ఇటీవలే టీవీలలో ఊదరగొట్టాడు బాబు, కానీ అస‌లు విష‌యం వేరే ఉంద‌ట‌. మాస్ట‌ర్ ప్లాన్ ఫ్రీగా చేసిన సింగపూర్ సంస్థకు.. ఇత‌ర సేవ‌ల‌కు గానూ అనే క్లాజ్‌తో 11 కోట్ల 92 లక్షల 8 వేల 850 రూపాయలు చెల్లించటానికి ఏపీ స‌ర్కారు స‌న్నాహాలు చేస్తోంది. ఆ ఇత‌ర సేవ‌లేంటో ఎవ‌రికీ తెలియ‌దు. ఇచ్చింది మాస్ట‌ర్‌ప్లాన్ మాత్ర‌మే. ఈ లెక్క‌న బాబు చెప్పిన ఉచితం మాస్ట‌ర్‌ప్లాన్ ఖ‌రీదు దాదాపు 12 కోట్ల‌పై పైనేన‌న్న‌మాట‌. మొద‌ట్నించీ మీడియా, ప్ర‌తిప‌క్షాలు అనుమాన‌ప‌డుతున్నట్టే సింగ‌పూర్ ఏపీ ఖ‌జానానుంచి చిల‌క్కొట్టుడు ప్రారంభించింది. ఉచిత సేవ‌లు, స్విస్ చాలెంజ్ భాగ‌స్వామ్యం అని చెబుతున్న రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ నుంచి నిర్మాణం వ‌ర‌కూ మొత్తం బాదుడు వ్య‌హార‌మేన‌ని దీంతో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని విప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. నా ప‌ర‌ప‌తిని చూసి ఉచితంగానే అద్భుత‌మైన మాస్ట‌ర్ ప్లాన్ ఇచ్చార‌ని బాబు ఊదిన బాకా అంతా ఉత్తదేన‌ని తేలిపోయింది. ఈ చెల్లింపులు, ఫ్రీ సేవ‌ల డ్రామా త‌రువాత చంద్ర‌బాబు న‌మ్మిన‌బంటు మున్సిప‌ల్ శాఖా మంత్రి నారాయ‌ణ శాఖ ద్వారా ఈ చెల్లింపుల‌కు తెర‌లేప‌టంతో అనుమానాలు ఇంకా బ‌ల‌ప‌డుతున్నాయి.

First Published:  10 Oct 2015 5:03 AM GMT
Next Story