Telugu Global
Others

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి ఎదురుదెబ్బ

అమరావతి శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న వేళ నేషనల్ గ్రీన్ టిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. చివరకు చదును చేసే కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దని తేల్చిచెప్పింది. రాజధాని పేరుతో పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారంటూ శ్రీమన్నారాయణ అనే మాజీ జర్నలిస్ట్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పంటపొలాలను  నాశనం చేస్తున్నారంటూ కొన్ని సాక్ష్యలను కూడా ట్రిబ్యునల్ ముందు ఉంచారు. దీనిపై విచారణ జరిపిన […]

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి ఎదురుదెబ్బ
X

అమరావతి శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న వేళ నేషనల్ గ్రీన్ టిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. చివరకు చదును చేసే కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దని తేల్చిచెప్పింది.

రాజధాని పేరుతో పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్నారంటూ శ్రీమన్నారాయణ అనే మాజీ జర్నలిస్ట్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పంటపొలాలను నాశనం చేస్తున్నారంటూ కొన్ని సాక్ష్యలను కూడా ట్రిబ్యునల్ ముందు ఉంచారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజధాని ప్రాంతంలో తోటలు తొలగించవద్దని ఆదేశించింది. ముంపు, మెట్ట భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలంటూ తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది.

గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే రాజధాని శంకుస్తాపనకు కూడా వర్తిస్తుందని పిటిషనర్ చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శంకుస్థాపన తేదీనాటికి అన్ని సద్దుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రం పర్యావరణ అనుమతి కూడా ఇచ్చిందని… ఆ ఉత్తర్వులు అందడానికి కాస్త సమయం పడుతుందని చెబుతోంది.

First Published:  10 Oct 2015 4:47 AM GMT
Next Story