Telugu Global
Others

300 మంది ఉగ్రవాదులను చంపిన రష్యా  (వీడియో)

సిరియాతో తిష్టవేసి ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులపై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి.  ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మృతుల్లో ఇద్దరు ఉగ్రవాద కమాండర్లు కూడా ఉన్నారు. రష్యా రక్షణ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. మునుముందు కూడా ఇదే స్థాయిలో ఉగ్రవాదులపై దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. దాదాపు 60 చోట్ల వైమానిక దాడులు నిర్వహించినట్టు తెలిపింది. గడిచిన 10 రోజులుగా సిరియాకు మద్దతుగా రష్యా ఈ దాడులు నిర్వహిస్తోంది. […]

300 మంది ఉగ్రవాదులను చంపిన రష్యా  (వీడియో)
X
సిరియాతో తిష్టవేసి ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులపై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మృతుల్లో ఇద్దరు ఉగ్రవాద కమాండర్లు కూడా ఉన్నారు. రష్యా రక్షణ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. మునుముందు కూడా ఇదే స్థాయిలో ఉగ్రవాదులపై దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. దాదాపు 60 చోట్ల వైమానిక దాడులు నిర్వహించినట్టు తెలిపింది. గడిచిన 10 రోజులుగా సిరియాకు మద్దతుగా రష్యా ఈ దాడులు నిర్వహిస్తోంది. రోజుకు పది శిబిరాలపై దాడులు నిర్వహిస్తూ వచ్చిన రష్యా… ఉగ్రవాదులు మరోచోటికి శిబిరాలను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులను ముమ్మరం చేసింది. ఉగ్రవాదులకు పారిపోయే అవకాశం కూడా ఇవ్వకూడదని రష్యా భావిస్తోంది. అయితే సిరియాలోకి నేరుగా సైన్యాన్ని దింపే ఉద్దేశం లేదని రష్యా చెబుతోంది.

https://www.youtube.com/watch?v=Hiu-vpcSccY

First Published:  10 Oct 2015 1:00 AM GMT
Next Story