Telugu Global
NEWS

తెలంగాణ బంద్... విపక్షాల పిలుపు

రైతుల కోసం ఒక్కటైన తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ శనివారం తెలంగాణ వ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చాయి. జెండాలను పక్కనపెట్టి… ఇతర ఎజెండాలను వెనక్కి పడేసి ఏకైక లక్ష్యంతో బద్ద శత్రువులుగా ఉండే తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఒక్కటయ్యాయి. బంద్‌ సందర్భంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. మొత్తం మీద ఈ బంద్‌కు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క […]

తెలంగాణ బంద్... విపక్షాల పిలుపు
X

రైతుల కోసం ఒక్కటైన తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలు

రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ శనివారం తెలంగాణ వ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చాయి. జెండాలను పక్కనపెట్టి… ఇతర ఎజెండాలను వెనక్కి పడేసి ఏకైక లక్ష్యంతో బద్ద శత్రువులుగా ఉండే తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఒక్కటయ్యాయి. బంద్‌ సందర్భంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. మొత్తం మీద ఈ బంద్‌కు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క ఎంఐఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ ఒక్కటై నేటి బంద్‌కు పిలుపు ఇచ్చాయి. రైతుల కోసం నాలుగు రోజుల నుంచి తెలంగాణలో బస్సు యాత్ర జరుపుతున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, బీజేపీలతోపాటు వామపక్షాలు కూడా బంద్‌లో ఒక్కటై పని చేస్తున్నాయి. తాము కూడా రైతు పక్షమే అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా చేతులు కలిపింది.
మొత్తం మీద అన్నదాతల ఆక్రందనలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న కుటుంబాల ఆవేదన అన్ని పార్టీలను ఒక్కటి చేశాయి. బంద్‌ను ఎలాగైనా విజయవంతం చేయాలని టీటీడీపీ నేతలు నాలుగు లక్షల మంది కార్యకర్తలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సందేశాలు పంపారు. ఏకకాలంలో రైతులకు రుణ మాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేస్తూ విపక్షాలు ఈ బంద్‌కు పిలుపు ఇచ్చారు. బంద్‌ నేపథ్యంలో ముందురోజు అంటే శుక్రవారం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి చార్మినార్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని, శనివారం తలపెట్టిన బంద్‌ను కూడా ప్రజలు జయప్రదం చేస్తారని, అన్నదాతలకు అందరూ సంఘీభావాన్ని ప్రకటిస్తారని తాము నమ్ముతున్నామని టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ నేత ఎల్‌. రమణ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్, రామచంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ రైతుల్ని ఆదుకోవడానికి, ఈ దున్నపోతు ప్రభుత్వంలో స్పందన కల్పించడానికి బంద్‌ను విజయవంతం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలను కోరారు. వామపక్ష నేతలు కూడా రైతు బాధిత కుటుంబాలను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. రైతులను విస్మరిస్తున్న కేసీఆర్‌ కాలగర్భంలో కలిసిపోతారని దుయ్యబట్టారు. బంద్‌కు ప్రజలందరూ సహకరించడం ద్వారా రైతులకు సంఘీభావం పలకాలని విపక్ష నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1400 మంది రైతు కుటుంబాలకు పెంచిన ఎక్స్‌గ్రేషియా అక్టోబర్‌ చివరిలోగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండు చేశారు. తిండి పెట్టిన రైతు ఏడుస్తున్నాడని తెలంగాణ ప్రజలంతా రైతుకు అండగా ఉండాలని, వారికి ధైర్యం చెప్పాలని ఎల్‌ రమణ పిలుపు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలపై జీవో విడుదల చేసేవరకు రైతుల కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బంద్‌ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి మొద్దు నిద్ర నటిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మేల్కొలపాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కోరారు. మీడియా ద్వారా వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు, తెలంగాణ ప్రజలందరూ బంద్‌కు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలూ విజ్ఞప్తి చేశాయి.

First Published:  9 Oct 2015 3:01 PM GMT
Next Story