Telugu Global
Others

కొన‌సాగుతున్న సానియా జైత్ర‌యాత్ర‌!

భార‌త టెన్నిస్ స్టార్ సానియామీర్జా జైత్ర యాత్ర కొన‌సాగుతుంది. టైటిళ్ల వేట‌లో భాగంగా మార్టినా హింగీస్‌తో క‌లిసి చైనా ఓపెన్ ఫైన‌ల్‌లో బ‌రిలోకి దిగిన సానియా జోడీని విజ‌యం వ‌రించ‌డంతో వ‌రుస‌గా ఎనిమితో టైటిల్ కైవ‌సం చేసుకున్నారు. శనివారం బీజింగ్ లో జరిగిన ఫైనల్లో ఆరోసీడ్ తైపీ జంట హావో చింగ్ చాన్, యంగ్ జాన్ చాన్‌తో తలపడ్డ టాప్ సీడ్ సానియా ద్వయం 6-7(9), 6-1, 10-8తో విజయం సాధించింది. గంటా 40 నిమిషాల పాటు […]

కొన‌సాగుతున్న సానియా జైత్ర‌యాత్ర‌!
X

భార‌త టెన్నిస్ స్టార్ సానియామీర్జా జైత్ర యాత్ర కొన‌సాగుతుంది. టైటిళ్ల వేట‌లో భాగంగా మార్టినా హింగీస్‌తో క‌లిసి చైనా ఓపెన్ ఫైన‌ల్‌లో బ‌రిలోకి దిగిన సానియా జోడీని విజ‌యం వ‌రించ‌డంతో వ‌రుస‌గా ఎనిమితో టైటిల్ కైవ‌సం చేసుకున్నారు. శనివారం బీజింగ్ లో జరిగిన ఫైనల్లో ఆరోసీడ్ తైపీ జంట హావో చింగ్ చాన్, యంగ్ జాన్ చాన్‌తో తలపడ్డ టాప్ సీడ్ సానియా ద్వయం 6-7(9), 6-1, 10-8తో విజయం సాధించింది. గంటా 40 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గెలుపొందేందుకు శ్రమించాల్సి వ‌చ్చింది. మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫలితంగా ఆ సెట్ 18 గేముల పాటు సాగింది. చివరికి సానియా జంటకే విజయం దక్కింది. ఈ జోడీకి ఈ డబ్ల్యూటీఏ సీజన్‌లో ఇది ఎనిమిదో టైటిల్‌కాగా, వరుసగా నాలుగో టైటిల్ కావడం విశేషం. సానియానా..? మ‌జాకా

First Published:  10 Oct 2015 10:05 PM GMT
Next Story