Telugu Global
Others

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తిన అన్నా

లోక్‌పాల్‌ కోసం దేశాన్ని కదిలించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలను చేయూత ఇచ్చేందుకు స్వాతంత్రం వచ్చాక పరిమిత కాలంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడిదో రాజకీయ వ్యవహారంగా మారిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల వల్ల దేశ భవిష్యత్తుకే ముప్పు రాబోతోందని హెచ్చరించారు. రాజకీయ పార్టీల జోక్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం రిజర్వేషన్ల అంశాన్ని […]

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తిన అన్నా
X

లోక్‌పాల్‌ కోసం దేశాన్ని కదిలించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలను చేయూత ఇచ్చేందుకు స్వాతంత్రం వచ్చాక పరిమిత కాలంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడిదో రాజకీయ వ్యవహారంగా మారిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల వల్ల దేశ భవిష్యత్తుకే ముప్పు రాబోతోందని హెచ్చరించారు. రాజకీయ పార్టీల జోక్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నాయని ఆక్షేపించారు. రాజస్థాన్‌లో అన్నా హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ స్వాతంత్ర్యానంతరం కొంతకాలంపాటు అవసరమనుకున్న రిజర్వేషన్లు ఇంకా కొనసాగడం సరికాదన్నారు. రిజర్వేషన్ల అంశంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం ప్రారంభమైనప్పటి నుంచీ దేశానికి ప్రమాదం పెరిగిందని హజారే చెప్పారు. రిజర్వేషన్ల విధానంపై ఒకసారి సమీక్ష జరపాలని, ఎవరికి నిజంగా రిజర్వేషన్లు అవసరమో గుర్తించాలని ఆయన అన్నారు. పేదలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు అవసరం లేనివారికి ఇస్తున్నారని, ఈ ప్రొవిజన్‌ దుర్వినియోగం అవుతుందని హజారే అన్నారు.

First Published:  11 Oct 2015 1:00 AM GMT
Next Story