కబ్జా నేత ఇంటి ముందే ఆత్మహత్యలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో దారుణం జరిగింది. స్థానిక టీఆర్ఎస్‌ నేత తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఓ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగింది. తండ్రి, నలుగురు కొడుకులు టీఆర్ఎస్ నేత ఇంటి ముందే పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన వెంకటయ్య స్థలాన్ని టీఆర్ఎస్ నేత ఇర్పాన్ ఆక్రమించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. పైగా సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఇర్పాన్ సిద్ధమవడంతో వెంకటయ్య కుటుంబం ఆందోళన చెందింది.  ఉదయం వెంకటయ్య, ఆయన కుమారులు శ్రీశైలం, మహేష్, చంద్రశేఖర్, కుమార్‌లు ఇర్పాన్ ఇంటి ముందే పురుగుల మందు తాగారు. శ్రీశైలం, మహేష్ చనిపోయారు. న్యాయం చేయాలంటూ మృతదేహాలతో బంధువులు రోడ్డుపై బైఠాయించారు.