Telugu Global
Others

రాహుల్ సొంత టీమ్ ....

కాంగ్రెస్ అంటే 110పదేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఏపార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం అక్కడే ఉంటుంది. ఎంతలా అంటే ఆపార్టీలో కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు అందరూ నాయకులే. ఎవరికి వారు స్వతంత్రులే. నచ్చితే పొగుడుతారు. నచ్చకపోతే అధ్యక్షుడినైనా తిట్టేస్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తన సొంత టీమ్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారట. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకుల పనితీరు ఆధారంగా […]

రాహుల్ సొంత టీమ్ ....
X

కాంగ్రెస్ అంటే 110పదేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఏపార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం అక్కడే ఉంటుంది. ఎంతలా అంటే ఆపార్టీలో కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు అందరూ నాయకులే. ఎవరికి వారు స్వతంత్రులే. నచ్చితే పొగుడుతారు. నచ్చకపోతే అధ్యక్షుడినైనా తిట్టేస్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తన సొంత టీమ్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారట. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకుల పనితీరు ఆధారంగా 3వేల మందిని ఎంపిక చేశారట. అందులోంచి కేవలం 150మందిని మాత్రమే తనను కలవడానికి ఢిల్లీకి ఆహ్వానం పంపారట.

రాహుల్ ఎంపిక చేసిన సభ్యుల్లో తెలంగాణకు చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ప్రొటోకాల్ విభాగం చైర్మన్ వేణుగోపాల్, ఎమ్మెల్యే సంపత్ కుమార్, పీసీసీ కార్యదర్శి మహేష్ కుమార్, ఇరావత్రి అనిల్ కుమార్ ఉన్నారట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ఎనిమిది మంది కూడా పీసీసీ చీఫ్ సహా మూడో కంటికి తెలియకుండా ఢిల్లీకి వెళ్లారు. చివరకు తమను రాహుల్ పిలిచారని ఒకరితో ఒకరు చెప్పుకోలేదట. దీనికి కారణం ఎవరికి తెలిస్తే ఏం అడ్డంకులు సృష్టిస్తారరోనని భయం. కానీ ఎలాగోలా విషయం బయటకు లీక్ అయింది.

తెలంగాణలో సీనియర్ నేతలు ఎంతో మంది ఉండగా ఆ 8మందినే ఎలా ఎంపిక చేశారని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారట. రాహుల్ దృష్టిలో పడితే వారి జాతకం తిరిగినట్టేనని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అలా ఈ ఎనిమిది మందికి కూడా భవిష్యత్తులో ఏఐసీసీలో కార్యదర్శి పదవులతోపాటు, పార్టీ తరఫున వివిధ రాష్ట్రాల్లో పరిశీలకులుగా, పార్టీ తరుఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తుంటారు. మొత్తం మీద రాహుల్ టీమ్ లో ఉన్న నాయకుల పంట పండినట్టేనని మరి కొందరు నాయకులు అంటున్నారు.

First Published:  11 Oct 2015 1:15 AM GMT
Next Story