Telugu Global
NEWS

దీక్ష కొనసాగింపు మంచిది కాదు

ప్రత్యేక హొదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది.  గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద దీక్ష కొనసాగుతోంది.  ఉదయం నుంచి డాక్టర్లు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 110/70, పల్స్ రేటు 65 గా ఉంది. షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని వైద్యులు తెలిపారు.  కీటోన్స్‌ స్థాయికి కూడా పెరుగుతోందని వెల్లడించారు. బరువు కూడా జగన్ బాగా తగ్గిపోయారు.  ఇకపై దీక్ష కొనసాగించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది […]

దీక్ష కొనసాగింపు మంచిది కాదు
X

ప్రత్యేక హొదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద దీక్ష కొనసాగుతోంది. ఉదయం నుంచి డాక్టర్లు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 110/70, పల్స్ రేటు 65 గా ఉంది. షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. కీటోన్స్‌ స్థాయికి కూడా పెరుగుతోందని వెల్లడించారు. బరువు కూడా జగన్ బాగా తగ్గిపోయారు.

ఇకపై దీక్ష కొనసాగించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని సూచించారు. దీక్ష విరమించేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే దాని ప్రభావం భవిష్యత్తులోనూ ఆరోగ్యంపై పడుతుందని హెచ్చరించారు. ఐదు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రతి నాలుగు గంటలకొసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

First Published:  11 Oct 2015 12:21 AM GMT
Next Story