చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్ …అరకిలో బంగారం స్వాధీనం

మరో చైన్‌ స్నాచింగ్‌ ముఠా దొరికిపోయింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా నుంచి అర కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యులుగా పోలీసులు గుర్తించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు స్నాచింగ్‌ సంఘటనలతో వీరికి సంబంధాలున్నాయని ఎల్బీ నగర్‌ పోలీసులు తెలిపారు. ముఠాలోని సభ్యులంతా యువకులేనని, వీరంతా మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వీరిని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఎల్బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.