Telugu Global
NEWS

జగన్‌ దీక్ష భగ్నానికి రంగం సిద్ధం?

జగన్‌ నిరవధిక నిరాహారదీక్షను విరమింపజేయడానికి రంగం సిద్ధమైంది. ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటాక అందరూ ఆదమరచి నిద్రస్తున్న వేళ చడీచప్పుడూ కాకుండా దీక్షను భగ్నం చేయాలని భావిస్తున్నారు. సోమవారం జగన్‌కు నాలుగుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్‌, పల్స్‌రేటు, కోటోన్స్‌… అన్నీ అసాధారణంగానే ఉన్నాయి. కోటోన్స్‌ మైనస్‌లో ఉండాల్సింది ఫ్లస్‌-3గా నమోదయ్యాయి. […]

జగన్‌ దీక్ష భగ్నానికి రంగం సిద్ధం?
X

జగన్‌ నిరవధిక నిరాహారదీక్షను విరమింపజేయడానికి రంగం సిద్ధమైంది. ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటాక అందరూ ఆదమరచి నిద్రస్తున్న వేళ చడీచప్పుడూ కాకుండా దీక్షను భగ్నం చేయాలని భావిస్తున్నారు. సోమవారం జగన్‌కు నాలుగుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్‌, పల్స్‌రేటు, కోటోన్స్‌… అన్నీ అసాధారణంగానే ఉన్నాయి. కోటోన్స్‌ మైనస్‌లో ఉండాల్సింది ఫ్లస్‌-3గా నమోదయ్యాయి. దీక్ష మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన మూడు కిలోల బరువు తగ్గిపోయారు. వెంటనే ప్లూయిడ్స్‌ ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు. లేనిపక్షంలో శరీరంలోని ముఖ్యమైన అవయవాలన్నీ దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
నిజానికి దీక్ష ప్రజల దృష్టిని ఆకర్షించిందని, ఇంతకుమించి అవసరం లేదని కొంతమంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా సూచిస్తున్నారు. అయితే జగన్‌ దీక్షను కొనసాగించాలనే పట్టుదలతో ఉండడంతో ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ఈనేపథ్యంలో దీక్ష శిబిరానికి వెళ్ళిన జగన్‌ తల్లి విజయమ్మ, భార్య భారతి కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. దీక్ష తన రాజకీయ జీవితం కోసం చేయడం లేదని, రాష్ట్ర ప్రజల అభివృద్దికి ఉద్దేశించి చేస్తున్నందున నిరశనను విరమించే ప్రసక్తే లేదని జగన్‌ అంటున్నారని బొత్స చెబుతున్నారు.

First Published:  12 Oct 2015 12:18 PM GMT
Next Story